ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త

పాట రచయిత: సిరివెళ్ల హనోక్
Lyricist: Sirivella Hanok

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
నిత్యుడగు తండ్రి సమాధానకర్త (2)
తనవంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో
తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో (2)     ||ఆశ్చర్యకరుడు||

తన చేతిలో రోగాలు లయమైపోయెను
తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను (2)
తన మాటతో ప్రకృతినే శాసించినవాడు (2)
నీటిపై ఠీవిగా నడచినవాడతడు (2)      ||ఆశ్చర్యకరుడు||

మనకోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చినవాడతడు
మనకోసం సజీవుడై లేచినవాడతడు (2)
తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు (2)
తన సర్వాన్నే ధారబోసిన త్యాగశీలి క్రీస్తు (2)    ||ఆశ్చర్యకరుడు||

Aascharyakarudu Aalochanakartha
Nithyudagu Thandri Samaadhaana Kartha (2)
Thanavanti Goppa Devudu Evarunnaarilalo
Thana Saatainaa Dheetainaa Devudu Ledilalo (2)    ||Aascharyakarudu||

Thana Chethilo Rogaalu Layamaipoyenu
Thana Chooputho Dayyaalu Vilvilalaadenu (2)
Thana Maatatho Prakruthine Shaasinchinavaadu (2)
Neetipai Teevigaa Nadachinavaadathadu (2)   ||Aascharyakarudu||

Manakosam Thana Praanaanne Bali Ichchinavaadathadu
Manakosam Sajeevudai Lechinavaadathadu (2)
Thana Shaanthine Panchipettina Shaanthamoorthy Yesu (2)
Thana Sarvaanne Dhaarabosinaa Thyaagasheeli Kreesthu (2)   ||Aascharyakarudu||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply