కృతజ్ఞతన్ తలవంచి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

కృతజ్ఞతన్ తలవంచి
నాదు జీవము అర్పింతును
లేదే ఇక-నే ఈవి ఇల
అర్పింతును నన్నే నీకు (2)

దూరమైతి నీ ప్రేమ మరచి
నే రేపితి నీ గాయముల్ (2)
దూరముగా నిక వెళ్ళజాల
కూర్చుండెద నీ చెంతనే (2)       ||కృతజ్ఞతన్||

ఆకర్షించే లోకాశాలన్ని
లోక మహిమ నడ్డగించు (2)
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
నిక్కముగా త్యజింతును (2)       ||కృతజ్ఞతన్||

తరముల నీ ప్రేమ నాకై
వర్ణింపను అశక్యము (2)
నిరంతరము సేవించినను
తీర్చలేను నీ ఋణము (2)      ||కృతజ్ఞతన్||

Kruthagnathan Thalavanchi
Naadu Jeevamu Arpinthunu
Lede Ika-ne Eevi Ila
Arpinthunu Nanne Neeku (2)

Dooramaithi Nee Prema Marachi
Ne Repithi Nee Gaayamul (2)
Dooramugaa Nika Vellajaala
Koorchundedha Nee Chenthane (2)      ||Kruthagnathan||

Aakarshinche Lokaashalanni
Loka Mahima Naddaginchu (2)
Korkelanni Kreesthu Premakai
Nikkamugaa Thyajinthunu (2)      ||Kruthagnathan||

Tharamula Nee Prema Naakai
Varnimpanu Ashakyamu (2)
Nirantharamu Sevinchinanu
Theerchalenu Nee Runamu (2)      ||Kruthagnathan||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply