నీతిగల యెహోవా స్తుతి

పాట రచయిత: పసుపులేటి దావీదు
Lyricist: Pasupuleti Daaveedu

నీతిగల యెహోవా స్తుతి మీ – ఆత్మతో నర్పించుడి
మీ ఆత్మతో నర్పించుడి – దాతయవు మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి       ||నీతి||

చదల బుడమియు రవియు జలధియు – నదులు గిరులును జక్కగా
సదమలంబగు దైవ నామము – సర్వదా నుతి జేయును      ||నీతి||

సర్వశక్తుని కార్యముల కీ – సర్వ రాష్ట్రము లన్నియు
గర్వములు విడి తలలు వంచుచు – నుర్విలో నుతిజేయను      ||నీతి||

గీత తాండవ వాద్యములచే – బ్రీతి పరచెడు సేవతో
పాతకంబులు పరిహరించెడు – దాతనే సేవించుడి      ||నీతి||

పరమ దూతలు నరులు పుడమిని – మొరలుబెట్టుచు దేవుని
పరము నందున్నట్టి యేసుని – పాదములు సేవింతురు      ||నీతి||

ఇలను భక్తులు గూడుకొనియా – బలము గల్గిన దేవుని
వెలయు స్తుతి వే నోళ్ళతోడను – విసుగు జెందక జేయుడి      ||నీతి||

ఆత్మ నీవిక మేలుకొని శు – ధ్ధాత్మ యేసుని దండ్రిని
త్రిత్వమగునా యేక దేవుని – హర్షమున సేవింపవే      ||నీతి||

Neethigala Yehovaa Sthuthi Mee – Aathmatho Narpinchudi
Mee Aathmatho Narpinchudi – Daathayou Mana Kreesthu Neethini
Daalchukoni Sevinchudi        ||Neethi||

Chadala Budamiyu Raviyu Jaladhiyu – Nadulu Girulunu Jakkagaa
Sadamalambagu Daiva Naamamu – Sarvadaa Nuthi Jeyunu        ||Neethi||

Sarvashakthuni Kaaryamula Kee – Sarva Raashtramu Lanniyu
Garvamulu Vidi Thalalu Vanchuchu – Nurvilo Nuthijeyanu        ||Neethi||

Geetha Thaandava Vaadyamulache – Breethi Parachedu Sevatho
Paathakambulu Pariharinchedu – Daathane Sevinchudi        ||Neethi||

Parama Doothalu Narulu Pudamini – Moralubettuchu Devuni
Paramu Nandunnatti Yesuni – Paadamulu Sevinthuru        ||Neethi||

Ilanu Bhakthulu Goodukoniyaa – Balamu Galgina Devuni
Velayu Sthuthi Ve Nollathodanu – Visugu Jendaka Jeyudi        ||Neethi||

Aathma Neevika Melukoni Shu – dhdhaathma Yesuni Dandrini
Thrithvamagunaa Yeka Devuni – Harshamuna Sevimpave        ||Neethi||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply