యేసు నీ నామామృతము

పాట రచయిత:
Lyricist:


యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవ
మా – దోషములను హరించి మోక్షని
వాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన           ||యేసు||

వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవ
యెంతో – కీడు జేసిన పాడు వైరిని
గోడుగో డనంగ వాని – తాడనము జేసితివి          ||యేసు||

పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవ
నీ – దాపు జేరిన వారి కందరి
కాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు         ||యేసు||

అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవ
మమ్ము పక్షముగ రక్షించి మోక్షసు
రక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు      ||యేసు||

అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవ
నీ – సుందర కరుణామృతము మా
డెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన        ||యేసు||

Yesu Nee Naamaamruthamu Maa – Kentho Ruchi Yayyaa (2) Deva
Maa – Doshamulanu Harinchi Mokshani
Vaasuluga Jeyutaku – Bhaasura Prakaashamaina       ||Yesu||

Vedu Kalaraga goodi Ninu Goni – Yaadu Vaariki (2) Deva
Yentho – Keedu Jesina Paadu Vairini
Godudo Dananga Vaani – Thaadanamu Jesithivi       ||Yesu||

Paapamulu Harimpa Neeve – Praapu Maakayyaa (2) Deva
Nee – Daapu Jerina Vaari Kandari
Kaapadalu Baapi Nithya Kaapugathi Joopinaavu        ||Yesu||

Akshaya Karuneksha Bhuvana – Rakshakaa Neeve (2) Deva
Mammu Pakshamuga Rakshinchi Mokshasu
Rakshanaku Deeksha Goni – Veekshithulamaina Maaku         ||Yesu||

Andamagu Nee Mandiramuna – Bondugaa Memu (2) Deva
Nee – Sundara Karunaamruthamu Maa
Dendamula Yandu Grolu – Tanduku Sundaramaina         ||Yesu||

 

 

FavoriteLoadingAdd to favorites

Leave a Reply