నీ సన్నిధిలో నేనున్న

పాట రచయిత:
Lyricist:


నీ సన్నిధిలో నేనున్న చాలు – చాలు
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలు

శ్రమ కాలమైనా తోడుగ నీవుండ
నీ నామ ధ్యానం నే చేతునయ్యా
నీతోనే నేను ఉంటానయ్యా (2)
నా జీవితాన నీవున్న చాలు – చాలయ్యా
నీతోనే ఉన్న నాకెంతో మేలు – మేలయ్యా        ||నీ సన్నిధిలో||

అర్పించినావు నా కొరకు నీ ప్రాణం
నా పాప భారం తొలగింప గోరి
నాతోనే నీవు ఉండాలని (2)
ఆశించినది నా రక్షణేగా – నీవు
నీతోనే నేను ఉంటాను ప్రభువా – యేసు           ||నీ సన్నిధిలో||

నను చంపబోయి సాతాను రాగా
నీ చేతి గాయం రక్షించునయ్యా
నీ ప్రేమయే నన్ను బ్రతికించునయ్యా (2)
నమ్మాను ప్రభువా నీదైన లోకం – లోకం
నీతోనే ఉన్నా అది నాకు సొంతం – సొంతం        ||నీ సన్నిధిలో||


Nee Sannidhilo Nenunna Chaalu – Chaalu
Neethone Unna Naakentho Melu – Melu

Shrama Kaalamainaa Thoduga Neevunda
Nee Naama Dhyaanam Ne Chethunayyaa
Neethone Nenu Untaanayyaa (2)
Naa Jeevithaana Neevunna Chaalu – Chaalayyaa
Neethone Unna Naakentho Melu – Melayyaa       ||Nee Sannidhilo||

Arpinchinaavu Naa Koraku Nee Praanam
Naa Paapa Bhaaram Tholagimpa Gori
Naathone Neevu Undaalani (2)
Aashinchinadi Naa Rakshanegaa – Neevu
Neethone Nenu Untaanu Prabhuvaa – Yesu        ||Nee Sannidhilo||

Nanu Champaboyi Saathaanu Raagaa
Nee Chethi Gaayam Rakshinchunayyaa
Nee Premaye Nannu Brathikinchunayyaa (2)
Nammaanu Prabhuvaa Needaina Lokam – Lokam
Neethone Unnaa Adi Naaku Sontham – Sontham         ||Nee Sannidhilo||

FavoriteLoadingAdd to favorites

Leave a Reply