లెక్కింపగ తరమా

పాట రచయిత:
Lyricist:


లెక్కింపగ తరమా నీ మేలులు
వివరింపగ తరమా నీ కార్యములు (2)
నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము
నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2)        ||లెక్కింపగ||

నీ ప్రేమలోనే తను ఎదగాలి
నీ రక్షణలోనే కొనసాగాలి (2)
నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని
నిరతం నిన్నే స్తుతియించాలి
తన జీవితమంతా నీ రెక్కల క్రింద
నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2)     ||లెక్కింపగ||

నీ వాక్యము తన హృదిలో ఉండాలి
నీ తలంపులు మదిలో నిండాలి (2)
నీ దయయందు మనుష్యుల దయయందు
ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి
నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో
ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2)       ||లెక్కింపగ||

Lekkimpaga Tharamaa Nee Melulu
Vivarimpaga Tharamaa Nee Kaaryamulu (2)
Neevichchina Bahumaanam
Bahu Shreshtamu
Neekichche Sthuthiyaagam Sweekarinchumu (2)      ||Lekkimpaga||

Nee Premalone Thanu Edagaali
Nee Rakshanalone Konasaagaali (2)
Nee Sannidhi Cheri Nee Gnaanamuthoni
Niratham Ninne Sthuthiyinchaali
Thana Jeevithamanthaa
Nee Rekkala Krinda
Ninne Ellappudu Sevinchaali (2)       ||Lekkimpaga||

Nee Vaakyamu Thana Hrudilo Undaali
Nee Thalampulu Madilo Nindaali (2)
Nee Dayayandu Manushyula Dayayandu
Prathi Yetaa Deevenalatho Vardhillaali
Nee Aathma Balamutho
Sthiramaina Manassutho
Prathi Chota Nee Saakshiga Jeevinchaali (2)        ||Lekkimpaga||

FavoriteLoadingAdd to favorites

Leave a Reply