Prema Nammakamu Gala

ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను
రక్తము చిందించి మా పాపము కడుగ
సిలువపై అర్పించెను – (2)

త్యాగసహిత ప్రేమజూపి
నెరవేర్చె తన నిబంధనను (2)
మనలను తానె నిర్మించె గనుక
మనలను ప్రేమించెను (2)
మనలను ప్రేమించెను          ||ప్రేమ||

శాశ్వత ప్రేమ చూపించెను
సిలువపై ఋజువు గావించెను (2)
తన రక్తములో పాపులనెల్ల
శుద్ధుల చేసెనుగా (2)
శుద్ధుల చేసెనుగా          ||ప్రేమ||

తండ్రివలెనే ప్రేమజూచి
నీచులనెల్ల ప్రేమించెను (2)
ఎవరు పాపము నొప్పుకొందురో
వారిని క్షమించును (2)
వారిని క్షమించును          ||ప్రేమ||

ఆత్మ శరీర ప్రాణములన్‌ అర్పించి
ప్రభును స్తుతింతుము (2)
హల్లెలూయ స్తుతి మహిమ ఘనత
ఎల్లప్పుడు ప్రభుకే (2)
ఎల్లప్పుడు ప్రభుకే          ||ప్రేమ||

Prema Nammakamu Gala Paraloka Thandri
Thana Kumaaruni Pampenu
Rakthamu Chindinchi Maa Paapamu Kaduga
Siluvapai Arpinchenu – (2)

Thyaaga Sahitha Prema Joopi
Neraverche Thana Nibandhananu (2)
Manalanu Thaane Nirminche Ganuka
Manalanu Preminchenu (2)
Manalanu Preminchenu         ||Prema||

Shaashwatha Prema Choopinchenu
Siluvapai Rujuvu Gaavinchenu (2)
Thana Rakthamulo Paapulanella
Shuddhula Chesenugaa (2)
Shuddhula Chesenugaa         ||Prema||

Thandri Valene Prema Joochi
Neechulanella Preminchenu (2)
Evaru Paapamu Noppukonduro
Vaarini Kshaminchunu (2)
Vaarini Kshaminchunu         ||Prema||

Aathma Shareera Praanamulan Arpinchi
Prabhunu Sthuthinthumu (2)
Hallelooya Sthuthi Mahima Ghanatha
Ellappudu Prabhuke (2)
Ellappudu Prabhuke         ||Prema||

Download Lyrics as: PPT

%d bloggers like this: