శక్తి చేత కాదు

పాట రచయిత: ఆకుమర్తి డానియెల్
Lyricist: Akumarthi Daniel


శక్తి చేత కాదు
బలము చేత కాదు
దేవుని ఆత్మచే
సమస్తము సాధ్యము (2)        ||శక్తి||

నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని
చేసెను దేవుడు శూన్యము నుండి (2)
తన రూపులో తన పోలికలో (2)
నిర్మించెను దేవుడు నరుని మంటి నుండి (2)        ||శక్తి||

కౄరమైన సింహాల బోనైననూ
విశ్వాసముతో సాగెను దానియేలు (2)
అగ్ని గుండములో మరణ శాసనములో (2)
ఇమ్మానుయేలు యేసయ్య తోడుగా (2)        ||శక్తి||

ఘోరమైన పాపాల బానిసైననూ
భారమైన బ్రతుకును గడుపుచున్ననూ (2)
ప్రియమార నిన్నే పిలువంగ యేసు (2)
దరి చేర రావా ఆ ప్రేమ నాథుని (2)        ||శక్తి||

Shakthi Chetha Kaadu
Balamu Chetha Kaadu
Devuni Aathmache
Samasthamu Saadhyamu (2)     ||Shakthi||

Noti Maata Dwaaraa Ee Sarva Srushtini
Chesenu Devudu Shoonyamu Nundi (2)
Thana Roopulo Thana Polikalo (2)
Nirminchenu Devudu Naruni Manti Nundi (2)     ||Shakthi||

Krooramaina Simhaala Bonainanu
Vishwaasamutho Saagenu Daaniyelu (2)
Agni Gundamulo Marana Shaasanamulo (2)
Immaanuyelu Yesayya Thodugaa (2)     ||Shakthi||

Ghoramaina Paapaala Baanisainanu
Bhaaramaina Brathukunu Gadupuchunnanu (2)
Priyamaara Ninne Piluvanga Yesu (2)
Dari Chera Raavaa Aa Prema Naathuni (2)     ||Shakthi||

Download Lyrics as: PPT

FavoriteLoadingAdd to favorites

Leave a Reply