కన్నీరేలమ్మా

పాట రచయిత: Samuel Karmoji
Lyricist: శామ్యూల్ కర్మోజి

Telugu Lyrics

కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పె (2)
యేసే తోడమ్మా                             ||కన్నీరేలమ్మా||

నీకేమీ లేదని ఏమీ తేలేదని
అన్నారా నిన్ను అవమాన పరిచారా
తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా (2)         ||కన్నీరేలమ్మా||

నీకెవరూ లేరని ఏం చేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరచారా
పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)             ||కన్నీరేలమ్మా||

English Lyrics

Audio

6 comments

  1. చనిపోవాలి అనుకున్న నన్ను ఈ పాట ఎంతో ఆదరించింది… నాకు జీవం పోసింది… జీవితం పట్ల ఆశ కలిగించింది ఈ పాట…

    1. లోకం మోసం చేసినా నా దేవుడు నాకూ ఎప్పటికీ మోసం చేయడు అని ఈ పాట ద్వారా తెలిసింది

Leave a Reply

HOME