హే ప్రభుయేసు

పాట రచయిత: ఏ బి మాసిలామణి
Lyricist: A B Maasilaamani

Telugu Lyrics

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా       ||హే ప్రభు||

శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ (2)
శాంతి స్వరూపా జీవనదీపా (2)
శాంతి సువార్తనిధీ         ||సిల్వధరా||

తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా (2)
విఫలులు చేసిన విజ్ఞాపనలకు (2)
సఫలత నీవెగదా        ||సిల్వధరా||

మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా (2)
పతితులు దేవుని సుతులని నేర్పిన (2)
హితమతి వీవెగదా       ||సిల్వధరా||

పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా (2)
మలమల మాడిన మానవ హృదయము (2)
కలకలలాడె కదా       ||సిల్వధరా||

కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత (2)
మానవ మైత్రిని సిల్వ పతాకము (2)
దానము జేసెగదా        ||సిల్వ ధరా||

దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా (2)
దేవునితో సఖ్యంబును జగతికి (2)
యీవి నిడితివి గదా        ||సిల్వ ధరా||

పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా (2)
దాపున జేరి పాపిని బ్రోచిన (2)
కాపరి వీవెగదా        ||సిల్వ ధరా||

ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా (2)
ఖలమయుడగు సాతానుని గర్వము (2)
ఖండనమాయె గదా        ||సిల్వ ధరా||

కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా (2)
కలుష ఎడారిలో కలువలు పూయుట (2)
సిలువ విజయము గదా           ||సిల్వ ధరా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

3 comments

  1. Dear Kranthi, thank you for your effort in posting this valuable lyric by late Dr.Masilamani garu. While I was on journey I stayed in a hotel. Suddenly like a spark one of the stanzas of this lyric crossed my mind i.e, ‘Devuni baasina lokamulo, Chaavuye kaapura munde kadha’…Immediately I was longing for a written lyric of this song in order that I meditate on it. While searching on google I found your post to be better suited for me. Indeed I am blessed by the same. How amazing our Lord’s wisdom and miraculous works in our midst in this world! Praise be to Him. Thank you. Sudheer, Advocate.

    1. Praise the Lord Sudheer brother!
      Praise God for the wonderful lyrics by Maasilaamani Garu. And I thank God that this site is useful to you when you needed. All Glory to Him!!

Leave a Reply

HOME