హల్లెలూయ పాట

పాట రచయిత: చంద్రశేఖర్ పులివెందుల
Lyricist: Chandrasekhar Pulivendula

Telugu Lyrics

హల్లెలూయ పాట – యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట – పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)       ||హల్లెలూయ||

కష్టాలుయే కలిగినా – కన్నీరుయే మిగిలినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)        ||హల్లెలూయ||

చెరసాలలో వేసినా- సంకెళ్లు బిగియించినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)        ||హల్లెలూయ||

నీ తల్లి నిను మరిచినా – మరువడు నీ దేవుడు (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)        ||హల్లెలూయ||

శోధనలు నిను చుట్టినా – సంతోషమే తట్టినా (2)
స్తుతి పాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)        ||హల్లెలూయ||

సింహాల కెరవేసినా – అగ్నిలో పడవేసినా (2)
ధీరుడవై సాగుమా – ప్రభు సిల్వనే చాటుమా (2)        ||హల్లెలూయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

2 comments

Leave a Reply

HOME