మాటే చాలయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మాటే చాలయ్యా యేసూ నాకు
నీ మాటలోనే జీవం ఉన్నది (2)
నీ మాట వల్లె జరుగును అద్భుతాలు
నీ మాట వల్లె జరుగును ఆశ్చర్యాలు (2)
నీ మాటకు సమస్తం సాధ్యమే (2)        ||మాటే||

సృష్టికర్తవు నీవే – సమస్తము సృజియించితివి
సృష్టంతయ నీ మాటకు లోబడుచున్నది (2)
నీ మాటకు శక్తి ఉన్నదయ్యా
నీ మాటకు సమస్తం లోబడును (2)        ||నీ మాట వల్లె||

పరమ వైద్యుడవు నీవే – స్వస్థపరచు దేవుడవు
దయ్యములన్ని నీ మాటకు లోబడి వొణుకును (2)
నీ మాటలో స్వస్థత ఉందయ్యా
నీ మాటతోనే విడుదల కలుగును (2)        ||నీ మాట వల్లె||

జీవాధిపతి నీవే – జీవించు దేవుడవు
నీ జీవము మమ్ములను బ్రతికించుచున్నది (2)
నీ మాటలో జీవం ఉందయ్యా
నీ మాటలే మాకు జీవాహారాము (2)        ||నీ మాట వల్లె||

English Lyrics

Audio

Leave a Reply

HOME