వెండి బంగారాల కన్న

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వెండి బంగారాల కన్న మిన్న అయినది
యేసు ప్రేమ – నా యేసు ప్రేమ (2)
లోక జ్ఞానమునకు మించిన ప్రేమ (2)
లోకస్థులు ఎవ్వరు చూపలేని ప్రేమ (2)        ||వెండి||

లోకమునకు వెలుగైన ప్రేమ
లోకమును వెలిగించిన ప్రేమ (2)
లోకులకై కరిగిపోయిన ప్రేమ
లోకాన్ని జయించిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)        ||వెండి||

ఏ స్థితికైనా చాలిన ప్రేమ
నీ పరిస్థితిని మార్చగల ప్రేమ (2)
నీకు బదులు మరణించిన ప్రేమ
చిర జీవము నీకొసగిన ప్రేమ (2)
యేసు ప్రేమా – శాశ్వత ప్రేమా (2)
హల్లెలూయా మహదానందమే (2)        ||వెండి||

English Lyrics

Audio

1 comment

  1. పాట చూచి పాడటానికి లిరిక్స్ స్వరము బాగుంది

Leave a Reply

HOME