పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
యేసయ్యా నా యేసయ్యా…
యేసయ్యా నా యేసయ్యా…
బ్రతికియున్నానంటే నీ కృప
జీవిస్తున్నానంటే నీ కృప (2)
ఏ యోగ్యత నాలో లేదు – ఎంత భాగ్యము నిచ్చావు
పరిశుద్ధత నాలో లేదు – నీ ప్రేమను చూపావు (2)
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (2)
నా జీవిత నావా సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదలలేక నా కథ ముగించబోగా
నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2)
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా
నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా||
నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా
ఆప్యాయత చూపి ఆదరించినావు (2)
నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది
నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2) ||బ్రతికి||
Very good page super transalation…….!Praise the Lord