పుట్టె యేసుడు నేడు

పాట రచయిత: ఫేలిక్స్ అండ్రు
Lyricist: Felix Andrew

Telugu Lyrics

పుట్టె యేసుడు నేడు – మనకు – పుణ్య మార్గము జూపను
పట్టి యయ్యె బరమ గురుఁడు – ప్రాయశ్చిత్తుడు శ్రీ యేసు        ||పుట్టె||

ధర బిశాచిని వేడిన – దు –ర్నరుల బ్రోచుటకై యా
పరమవాసి పాపహరుఁడు – వరభక్త జన పోషుడు (2)     ||పుట్టె||

యూద దేశములోన – బెత్లె -హేమను గ్రామమున
నాదరింప నుద్భవించెను – అధములమైన మనలను (2)     ||పుట్టె||

తూర్పు దేశపు జ్ఞానులు – పూర్వ – దిక్కు చుక్కను గాంచి
సర్వోన్నతుని మరియ తనయుని – మ్రొక్కిరి అర్పణంబులిచ్చిరి (2)     ||పుట్టె||

English Lyrics

Putte Yesudu Nedu – Manaku Punya Maargamu Joopanu
Patti Yayye Parama Gurudu – Praayaschitthudu Shree Yesu        ||Putte||

Dhara Bishaachimi Vedina – Du-rnarula Brochutakai Yaa
Parama Vaasi Paapaharudu – Varabhaktha Poshudu (2)         ||Putte||

Yooda Deshamulona – Bethle-hemanu Graamamuna
Naadarimpa Nudbhavinchenu – Adhamulamaina Manalanu (2)         ||Putte||

Thoorpu Deshapu Gnaanulu – Poorva – Dikku Chukkanu Gaanchi
Sarvonnathuni Mariya Thanayuni – Mrokkiri Arpanambulichchiri (2)         ||Putte||

Audio

ఇన్నేళ్లు ఇలలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం          ||ఇన్నేళ్లు||

లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం      ||ఇన్నేళ్లు||

మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం           ||ఇన్నేళ్లు||

English Lyrics

Innellu Ilalo Unnaamu Manamu
Challani Devuni Needalo
Gathinchipoye Kaalam – Smarinchu Yesu Naamam
Santhoshinchu Ee Dinam          ||Innellu||

Lokame Natanaalayam
Jeevithame Rangula Valayam (2)
Paralokame Manaku Shaashwatham
Paraloka Devuni Nithya Jeevam
Premaamayude Aa Paramaathmude
Padilaparachene Rakshana Bhaagyam        ||Innellu||

Maaru Manassu Manishiki Maargam
Paschaatthaapam Manasuku Mokshyam (2)
Nee Poorna Hrudayamutho Mokarillmaa
Nee Poorna Aathmatho Praardhinchumaa
Paripoornude Parishuddhaathmude
Karuninchune Kala Kaalam             ||Innellu||

Audio

HOME