నేను కూడా ఉన్నానయ్యా

పాట రచయిత: ఆడమ్ బెన్ని
Lyricist: Adam Benny

Telugu Lyrics

నేను కూడా ఉన్నానయ్యా
నన్ను వాడుకో యేసయ్యా (2)
పనికిరాని పాత్రనని
నను పారవేయకు యేసయ్యా (2)

జ్ఞానమేమి లేదుగాని
నీ సేవ చేయ ఆశ ఉన్నది (2)
నీవే నా జ్ఞానమని (2)
నీ సేవ చేయ వచ్చినానయ్య (2)        ||నేను||

ఘనతలొద్దు మెప్పులొద్దు
ధనము నాకు వద్దే వద్దు (2)
నీవే నాకు ఉంటే చాలు (2)
నా బ్రతుకులోన ఎంతో మేలు (2)        ||నేను||

రాళ్లతో నన్ను కొట్టిన గాని
రక్తము కారిన మరువలేనయ్యా (2)
ఊపిరి నాలో ఉన్నంత వరకు (2)
నీ సేవలో నేను సాగిపోదునయా (2)        ||నేను||

మోషే యెహోషువాను పిలిచావు
ఏలీయా ఎలీషాను నిలిపావు (2)
పేతురు యోహాను యాకోబులను (2)
అభిషేకించి వాడుకున్నావు (2)        ||నేను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME