ఆరాధించెదము యేసయ్య

పాట రచయిత: జాన్ చక్రవర్తి
Lyricist: John Chakravarthi

Telugu Lyrics

ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము (2)
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా (2)     ||ఆరాధించెదము||

ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు (2)
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు (2)
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు (2)       ||ఆరాధన||

మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు (2)
మోషే దేవుడు మాట్లాడే దేవుడు (2)
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు (2)       ||ఆరాధన||

దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు (2)
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు (2)
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు (2)       ||ఆరాధన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME