విడిపిస్తాడు నా యేసుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విడిపిస్తాడు నా యేసుడు
మరణపు లోయైనా నను విడువడూ (2)
మనసు ఓడిపోయిననూ
మనువు వాడిపోయిననూ (2)
నను ఎత్తుకొనీ…
నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక      ||విడిపిస్తాడు||

ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా
కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి      ||విడిపిస్తాడు||

ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా
బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి      ||విడిపిస్తాడు||

కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ
గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి      ||విడిపిస్తాడూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME