నా ప్రాణమా నా సమస్తమా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది

నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2)      ||నా ప్రాణమా||

పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2)
నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు
నే వెంబడింతు ప్రభు            ||నా ప్రాణమా||

అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2)
కంటిపాపగా నీవు నన్ను కాచితివి
కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను
నిన్ను కొలిచెదను            ||నా ప్రాణమా||

నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు
ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2)
నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు
నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును
నే ఇలలో జీవింతును            ||నా ప్రాణమా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME