అంటరాని వాడవంటు

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

అంటరాని వాడవంటు నన్ను
ఊరు బైటకు త్రోసి వేసిరి
దేహమంతా కుళ్లిపోయి – దుర్వాసనతో నిండిపోయే
అయిన వారు కానరాక – భుజము తట్టే వారు లేక
కంటి నిండా నిదుర పొక – ఒంటరిగ జీవించలేక
మరణమును బ్రతిమాలుకున్నా…
మరణమును బ్రతిమాలుకున్నా – అదియు నన్ను ముట్టలేదు
చావలేక బ్రతుకలేక విసికిపోయాను – నేను అలసిపోయాను
నీ దరికి చేరాను – నిన్నే నమ్ముకున్నాను
యేసు.. యేసు.. యేసు నా తట్టు తిరగవా
యేసు.. యేసు.. యేసు నా గోడు వినవా      ||అంటరాని||

నిలిచిపోయావు నా కేక వినగానే
కదలిపోయావు నా స్థితిని చూడగనే
నీ కడుపులోని దుఖమును నీ ముఖముపై చూసి
నేను కరిగిపోయాను
నీ కనికరము చూసి – కన్నీటితో తడిసిపోయాను
యేసు.. యేసు.. యేసు నీకెంత జాలి
చాలు.. చాలు.. చాలు నీ దయయే చాలు      ||అంటరాని||

నన్ను తాకావు నీ చేతులను చాపి
కుష్టు రోగము నా దేహము పైన ఉండగనే
నా గుండె లోపల మండుచున్న కోరికను చూసి
నన్ను ముట్టుకున్నావు
ఆ స్పర్శకొరకే కదా నే తపియించి పోయాను
యేసు.. యేసు.. యేసు నీలా ఉందురెవరు
చాలు.. చాలు.. చాలు నీ స్పర్శ చాలు      ||అంటరాని||

స్వస్థపరిచావు శుద్దునిగా చేసావు
మురికి కూపము నుండి నన్ను లేవనెత్తావు
నా తలను పైకెత్తుకొని బ్రతికే తరుణమిచ్చావు
నాకు బ్రతుకు నిచ్చావు
నిను ఆశ్రయించి నిరాశచెందు నరులు ఎవ్వరు
యేసు.. యేసు.. యేసు దండములు నీకు
చాలు.. చాలు.. నాకింక నీవే చాలు      ||అంటరాని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME