పాట రచయిత:
Lyricist:
Telugu Lyrics
స్తుతించెదను – నిన్ను నేను మనసారా
భజించెదను – నేను నిన్ను దినదినము
స్తోత్రార్హుడవు నీవే ప్రభు
సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను||
పూజార్హుడవు పవిత్రుడవు
పాపిని క్షమియించె మిత్రుడవు (2)
పరము చేర్చి ఫలములిచ్చె
పావనుడగు మా ప్రభువు నీవే (2) ||స్తుతించెదను||
కృపా కనికరములు గల దేవా
కరుణ జూపి కనికరించు (2)
కంటి రెప్ప వలె కాపాడు
కడవరకు మమ్ము కావుమయ్య (2) ||స్తుతించెదను||
సర్వశక్తి గల మా ప్రభువా
సజీవ సాక్షిగా చేయుమయా (2)
స్థిరపరచి మమ్ము బలపరుచు
సదా నీకే స్తోత్రాలర్పింతును (2) ||స్తుతించెదను||
English Lyrics
Sthuthinchedanu – Ninnu Nenu Manasaaraa
Bhaijinchedanu – Nenu Ninnu Dinadinamu
Sthothraarhudavu Neeve Prabhu
Samasthamu Nee Karpinchedanu (2) ||Sthuthinchedanu||
Poojaarhudavu Pavithrudavu
Paapini Kshamiyinche Mithrudavu (2)
Paramu Cherchi Phalamulichche
Paavanudagu Maa Prabhuvu Neeve (2) ||Sthuthinchedanu||
Krupaa Kanikaramulu Gala Devaa
Karuna Joopi Kanikarinchu (2)
Kanti Reppa Vale Kaapaadu
Kadavaraku Mammu Kaavumayaa (2) ||Sthuthinchedanu||
Sarvashakthi Gala Maa Prabhuvaa
Sajeeva Saakshigaa Cheyumayaa (2)
Sthiraparachi Mammu Balaparachu
Sadaa Neeke Sthothraalarpinthun (2) ||Sthuthinchedanu||
Audio
Download Lyrics as: PPT
కృపాకనికరములు గల దేవాది దేవడుని స్తుతించుట ఎంతో మంచిది. ఈ పాట పాడిన సహోదరుడు మన మధ్య లేనప్పటికి ఆయన పాడిన పాటలు యిప్పటికి సజీవముగా వున్నందుకు దేవునికే మహిమా ఘనత చెల్లును గాక… ఆమెన్.
Tq u my lord