మాట్లాడే యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మాట్లాడే యేసయ్యా
నాతో మాట్లాడుచున్నాడు (2)
(నన్ను) మోకాళ్ళ పైన ఆడించుచూ (2)
చంటి బిడ్డలాగ కాయుచున్నాడు (4)        ||మాట్లాడే||

వెన్నలాంటి కన్నులలో
కురిసే తన ప్రేమను పంచాలని (3)
వేకువనే తట్టుచున్నాడు
కునుకని నిద్రపోని నా యేసయ్యా (2)
తల్లిదండ్రి కన్న మిన్న అయిన దేవుడు
లోకాన నా యేసుకు సాటి లేరెవ్వరు (2)           ||మాట్లాడే||

అరుణోదయమున నేను లేచి
కృతజ్ఞతా స్తుతులను చెల్లించెదను (3)
ఉత్సాహగానముతో యేసయ్యను
సంగీత స్వరములతో ఘనపరచెదను (2)
ప్రతి క్షణము నన్ను నడిపించే దేవుడు
ప్రతి ఉదయం తన కృపతో నింపే నా దేవుడు (2)           ||మాట్లాడే||

లోకము నుండి నన్ను ప్రత్యేకించి
మైమరిపించాడు మహనీయుడు (3)
ఉపదేశముతో నన్ను నడుపుచున్నాడు
జీవముగల సంఘములో నిలిపియున్నాడు (2)
తన మాటతో నన్ను బలపరచాడు
కృప వెంబడి కృపతో నను నింపుచున్నాడు (2)           ||మాట్లాడే||

English Lyrics

Maatlaade Yesayyaa
Naatho Maatlaaduchunnaadu (2)
(Nannu) Mokaalla Paina Aadinchuchu (2)
Chanti Biddalaaga Kaayuchunnaadu (4)             ||Maatlaade||

Vennalaanti Kannulalo
Kurise Thana Premanu Panchaalani (3)
Vekuvane Thattuchunnaadu
Kunukani Nidraponi Naa Yesayyaa (2)
Thallidandri Kanna Minna Aina Devudu
Lokaana Naa Yesuku Saati Lerevvaru (2)            ||Maatlaade||

Arunodayamuna Nenu Lechi
Kruthagnathaa Sthuthulanu Chellinchedanu (3)
Uthsaahagaanamutho Yesayyanu
Sangeetha Swaramulatho Ghanaparachedanu (2)
Prathi Kshanamu Nannu Nadipinche Devudu
Prathi Udayam Thana Krupatho Nimpe Naa Devudu (2)            ||Maatlaade||

Lokamu Nundi Nannu Prathyekinchi
Maimaripinchaadu Mahaneeyudu (3)
Upadeshamutho Nannu Nadupuchunnaadu
Jeevamugala Sanghamulo Nilipiyunnaadu (2)
Thana Maatatho Nannu Balaparachaadu
Krupa Vembadi Krupatho Nanu Nimpuchunnaadu (2)            ||Maatlaade||

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME