ఆహా మహాత్మ

పాట రచయిత: పంతగాని పరదేశి
Lyricist: Panthagaani Paradeshi

Telugu Lyrics

ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా         ||ఆహా||

వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై         ||ఆహా||

నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి           ||ఆహా||

అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి         ||ఆహా||

నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా         ||ఆహా||

దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా         ||ఆహా||

శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా           ||ఆహా||

అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా          ||ఆహా||

English Lyrics

Audio

ఆహా యేమానందం

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2)          ||ఆహా||

ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2)          ||ఆహా||

అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము (2)       ||ఆహా||

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్ (2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము (2)        ||ఆహా||

English Lyrics

Audio

HOME