ఆకాశం నీ సింహాసనం

పాట రచయిత: జోయెల్ జశ్వంత్ గుమ్మడి
Lyricist: Joel Jaswanth Gummadi

Telugu Lyrics


ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం (2)
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2)
మార్గము నీవే – జీవము నీవే       ||ఆకాశం||

పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా (2)
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా       ||ఆకాశం||

నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా (2)
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా       ||ఆకాశం||

భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2)
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా       ||ఆకాశం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆకాశం అమృత జల్లులు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఆకాశం అమృత జల్లులు కురిపించింది
ఈ లోకం ఆనందమయమై మురిసింది (2)

అంతు లేని ఈ అనంత జగతిలో
శాంతి కొరవడి మసలుచుండగా (2)
రక్షణకై నిరీక్షణతో (2)
వీక్షించే ఈ అవనిలో (2)
శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ           ||ఆకాశం||

పొంతన లేని వింత జగతిలో
పాపాంధకారం ప్రబలి యుండగా (2)
సమ్మతిని మమతలను (2)
పెంచుటకై ఈ పృథివిపై (2)
ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ             ||ఆకాశం||

English Lyrics

Audio

HOME