నశియించెడి లోకంలో

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics


నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం
మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2)
అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ
పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా         ||నశియించెడి||

కాలంతో పాటుగా కృశియించును శరీరం
మరణం కబళించును ఏ ఘడియలోనైనా (2)
క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి (2)
వసియించు కలకాలం – సత్యమైన లోకంలో         ||నశియించెడి||

నిలచిపోవును మహిలోన బంధాలన్ని
మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో (2)
ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని (2)
యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని         ||నశియించెడి||

English Lyrics

Audio

నా దేవుని గుడారములో

పాట రచయిత: జయరాజ్
Lyricist: Jayaraj

Telugu Lyrics


నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2)
ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2)
నా యేసుని నివాసములో (2)         ||నా దేవుని||

సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా
రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2)
నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2)
నా యేసు రక్షకా నీవే కదా (2)         ||నా దేవుని||

నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను
నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2)
నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2)
నాదు స్వరము నా ప్రభువే (2)         ||నా దేవుని||

ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా
నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2)
నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2)
నా యేసు నాథుడా నీవే కదా (2)         ||నా దేవుని||

English Lyrics

Audio

రాజా నీ సన్నిధిలోనే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజా నీ సన్నిధి-లోనే
దొరికెనే ఆనందమానందమే
జీవా జలముతో పొంగే హృదయమే
పాడే స్తుతియు స్తోత్రమే
శ్రమల వేళా నీ ధ్యానమే
నా గానం ఆధారం ఆనందమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందగన్ – భాగ్యమే
నిలువని సిరుల కన్ననూ
క్షయమౌ ప్రేమ కన్ననూ
విలువౌ కృపను పొందితిన్ – స్తోత్రమే         ||రాజా||

మరల రాని కాలమల్లె – తరలిపోయే నాదు దోషం
నిలువదాయె పాప శాపాల భారం (2)
నీలో నిలిచి ఫలియించు తీగనై
ఆత్మ ఫలము పొందితినే         ||నిలువని||

తెలియరాని నీదు ప్రేమ – నాలో నింపే ఆత్మ ధైర్యం
జీవ జలమై తీర్చెనే ఆత్మ దాహం (2)
నీకై నిలిచి ఇలలోన జీవింప
ఆత్మ ఫలము పొందితినే         ||నిలువని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

ఆహా యేమానందం

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2)          ||ఆహా||

ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2)          ||ఆహా||

అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము (2)       ||ఆహా||

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్ (2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము (2)        ||ఆహా||

English Lyrics

Audio

HOME