పేతురు వలె నేను

పాట రచయిత: జాస్పర్ కునపో
Lyricist: Jasper Kunapo

Telugu Lyrics

ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును (2)
అత్యున్నత ప్రేమను కనుపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును (2)        ||ఆరాధ్యుడవు||

పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా (2)
ప్రయాసమే ప్రతిక్షణం ప్రతి నిమిషం పరాజయం
గలిలయ తీరమున నన్ను గమనించితివా (2)        ||ఆరాధ్యుడవు||

ప్రభురాకడ నెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తెను పలు చేపలు ప్రభు పనికై సమకూడి
సంతోషముతో ఒడ్డున గంతులేసెను (2)        ||ఆరాధ్యుడవు||

నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివా (2)
ఆచేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అద్వితీయ దేవుడవు నీవే ప్రభు (2)        ||ఆరాధ్యుడవు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

శాశ్వత కృపను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2)       ||శాశ్వత||

నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2)       ||శాశ్వత||

దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2)       ||శాశ్వత||

భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2)       ||శాశ్వత||

సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2)       ||శాశ్వత||

నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2)       ||శాశ్వత||

English Lyrics

Audio

 

 

HOME