నా నోటన్ క్రొత్త పాట

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను (2)
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా (2) హల్లెలూయా          ||నా నోటన్||

అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను (2)        ||ఆనందించెదను||

దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2)        ||ఆనందించెదను||

నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2)        ||ఆనందించెదను||

వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2)        ||ఆనందించెదను||

భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను (2)        ||ఆనందించెదను||

English Lyrics

Audio

నా యేసు ప్రభువా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా యేసు ప్రభువా నిన్ను నేను
ఆరాధించెదను స్తుతియింతును (2)
నీ ప్రేమా సన్నిధిలో నీ ముఖము నేను చూచుచు
ఆనందించెదను చిరకాలము నీలో (2)

నీ స్నేహమే నా బలము
నీ ఊపిరే నా జీవము
నీ వాక్యమే ఆధారము
నాకు ధైర్యమిచ్చును (2)       ||నీ ప్రేమా||

నా ప్రాణమైన యేసయ్యా
నీవుంటే నాకు చాలును
నీ కోసమే నే జీవింతున్
నిజమైన ప్రేమికుడా (2)       ||నీ ప్రేమా||

యేసయ్యా నా రక్షకా
యేసయ్యా నా జీవమా
యేసయ్యా నా స్నేహమా
నాదు ప్రాణ ప్రియుడా (2)       ||నీ ప్రేమా||

English Lyrics

Audio

HOME