పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
నాలో ఉన్న ఆశలన్నియు
నాలో ఉన్న ఊహలన్నియు
నాలో ఉన్న ప్రాణమంతయు – నీవే యేసయ్యా (2)
యేసయ్యా నీవే నా మార్గం
యేసయ్యా నీవే నా సత్యం
యేసయ్యా నీవే నా జీవం
నీవే నా ప్రాణం
నాకున్నవన్ని నీకే యేసయ్యా
నాలోన నిన్ను దాచానేసయ్యా (2)
నీ చేతులలో నా రూపమునే ముద్రించితివి
నా పాపముల కొరకై నీవు బలి అయిపోతివి (2)
పరిశుద్ధమైన రక్తము ద్వారా
పాపాలన్ని కడిగివేసితివి ||యేసయ్యా||
నా కోసమే ఈ భువికి వచ్చితివి
నా కోసమే నీ ప్రాణం ఇచ్చితివి (2)
నా హృదయములో నీ వాక్యమునే నే ఉంచితిని
నీ రాకకై నేను వేచి ఉంటిని (2)
పరిశుద్ధమైన నీ చేతులలో
నీ రూపములో నన్ను చేసితివి ||యేసయ్యా||