పాట రచయిత: జోనా శామ్యూల్
Lyricist: Jonah Samuel
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
ఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీ
నీ ఆత్మకు మేలుకై వాడుకోమని
వాట్సాప్.. మెసెంజర్.. ఏదైనా కానీ
దేవుని మహిమకై వాడుకోమని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అన్నా ఓ అక్కా
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా
మండే.. ట్యూస్డే.. ఏ రోజైనా కానీ
దేవుని సన్నిధిని వదలవద్దని
సమ్మర్.. వింటర్.. ఏదైనా కానీ
దేవుని పనికై ముందుండాలని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అంకుల్ ఓ ఆంటీ
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా
కోపం.. ఆనందం.. ఏదైనా కానీ
దేవుని ప్రేమను మరువవద్దని
ఫీవర్.. కాఫ్ అండ్ కోల్డ్.. ఏదైనా కానీ
దేవుని స్తుతించడం మానవద్దని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అన్నా ఓ అక్కా
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా
చాటి చెప్పనా – (2)
English Lyrics
Audio
Download Lyrics as: PPT