అయ్యా వందనాలు

పాట రచయిత: జేమ్స్ ఎజెకియెల్
Lyricist: James Ezekial

Telugu Lyrics

అయ్యా వందనాలు.. అయ్యా వందనాలు
అయ్యా వందనాలు నీకే (2)

మృతతుల్యమైన శారా గర్భమును – జీవింపచేసిన నీకే
నిరీక్షణే లేని నా జీవితానికి – ఆధారమైన నీకే (2)
ఆగిపోవచ్చయ్యా జీవితము ఎన్నో దినములు
అయినా నీవిస్తావయ్యా వాగ్ధాన ఫలములు (2)       ||అయ్యా||

అవమానమెదురైన అబ్రహాము బ్రతుకులో – ఆనందమిచ్చిన నీకే
నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు – నిరీక్షణనిచ్చిన నీకే (2)
కోల్పోలేదయ్యా జీవితము నిన్నే చూడగా
జరిగిస్తావయ్యా కార్యములు ఆశ్చర్యరీతిగా (2)       ||అయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చూచుచున్న దేవుడవయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2)
నీ పేరు మిటో ఎరుగనయ్యా (2)
నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2)          ||చూచుచున్న||

శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనై య్యాను (2)
ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)
దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును        ||చూచుచున్న||

ఇష్మాయేలుకు తల్లినైతిని
అయినవారితో త్రోసివేయబడితిని (2)
కన్నకొడుకు మరణము చూడలేక (2)
తల్లడిల్లిపోతున్న తల్లిని నేను
అనాథ తల్లిని నేను       ||చూచుచున్న||

పసివాడి మొరను ఆలకించావు
జీవజలములనిచ్చి బ్రతికించావు (2)
నీ సంతతిని దీవింతునని (2)
వాగ్దానమిచ్చిన దేవుడవు
గొప్ప దేవుడవు          ||చూచుచున్న||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME