ఆపత్కాలమున

పాట రచయిత: జాన్ ప్రసాద్ & జానకి రావు
Lyricist: John Prasad & Janaki Rao

Telugu Lyrics

ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే
అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే (2)
తల్లి కన్నా తండ్రి కన్నా
కాచిన దేవా నీకే స్తోత్రం (2)           ||ఆపత్కాలమున||

నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు
నేను లేచి కూర్చుండుటను సమస్తమెరిగితివి (2)
ఆకాశమునకు ఎక్కిననూ అక్కడ నీవే ఉన్నావు
భూదిగంతములు చుట్టిననూ అక్కడ నీవే ఉన్నావు
ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు
నీ కన్న దైవమెవరు మా పూజ్యనీయుడా            ||ఆపత్కాలమున||

నేను నడచే మార్గమంతటిలో నీ దూతల చేత
రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి (2)
మరణముగుండా వెళ్లిననూ విష సర్పములను తొక్కిననూ
చేయి విడువక ఎప్పుడునూ విడనాడక నను ఎన్నడునూ
నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై – (2)           ||ఆపత్కాలమున||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కన్నీళ్లతో పగిలిన గుండెతో

పాట రచయిత: శామ్యూల్ కర్మోజి
Lyricist: Samuel Karmoji

Telugu Lyrics

కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
మనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)
విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను
కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)
విడువడు నిన్ను

రాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినా
కాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునా
ప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినా
నీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా           ||విడువడు||

అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినా
నిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునా
బాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునా
శత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా        ||విడువడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME