నా జీవిత భాగస్వామివి

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు (2)
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా (2)

నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి (2)
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి (2)       ||నా జీవిత||

నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి (2)
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి (2)       ||నా జీవిత||

నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి (2)
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు (2)       ||నా జీవిత||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అనుదినము ప్రభుని

పాట రచయిత: కే విల్సన్
Lyricist: K Wilson

Telugu Lyrics

అనుదినము ప్రభుని స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను
అల్లుకుపోయేది ఆర్పజాలనిది
అలుపెరగనిది ప్రభు ప్రేమ (2)       ||అనుదినము||

ప్రతి పాపమును పరిహరించి
శాశ్వత ప్రేమతో క్షమియించునది
నా అడుగులను సుస్థిరపరచి
ఉన్నత స్థలమున నింపునది (2)      ||అల్లుకుపోయేది||

ప్రతి రేపటిలో తోడై నిలిచి
సిలువ నీడలో బ్రతికించినది
స్వర్గ ద్వారము చేరు వరకు
మాకు ఆశ్రయమిచ్చునది (2)       ||అల్లుకుపోయేది||

English Lyrics

Audio

HOME