సువార్తే పరిష్కారం

పాట రచయిత: సురేష్ వంగూరి
Lyricist: Suresh Vanguri

అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం
వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం

సువార్త సారం తెలిసుండీ
నిస్సార సాక్ష్యం మనదేనా
పరలోక వెలుగును కలిగుండీ
మరుగైన దీపం మనమేనా

ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా
ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం
సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం

జాతివిద్వేషపు జాడ్యంలో
మతోన్మాద విషమౌఢ్యంలో
దేశం ఆరని జ్వాలాయె
సంఘం హింసలపాలాయె          ||ఇకనైనా||

అబద్ద బోధల మోసాలు
అణగారుతున్నవి సంఘాలు
వేలకువేల కుటుంబాలు
నశించిపోతున్నవి చూడు          ||ఇకనైనా||

జెండరు గందరగోళాలు
లింగద్రవత్వపు ఘోరాలు
సంధిగ్ధంలో నేటితరం
సంక్షోభంలో మనిషితనం          ||ఇకనైనా||

సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై
చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా…

బహుళ సవాళ్ళను ఎదురుకొని
ఐక్యత బంధం నిలుపుకుని
రేపటి తరాన్ని శిష్యులుగా
నిలిపే బాధ్యత మనదేరా          ||ఇకనైనా||

Download Lyrics as: PPT

గాడాంధకారపు లోయలో

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics

గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే         ||గాడాంధకారపు||

పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే             ||గాఢాంధకారపు||

నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే          ||గాఢాంధకారపు||

చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే              ||గాఢాంధకారపు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME