పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
మారిన మనసులు మధురం మీకు
అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2)
ఇహ లోక కానుకలు అల్పములు మీకు
పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన||
నా హృదయ కుసుమమును అప్పము చేసి
నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2)
సమర్పింతు దేవా నా సర్వస్వమును
కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||
నా జయము అపజయము నీవే దేవా
నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2)
సమర్పింతు దేవా నా సర్వస్వమును
కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||