స్తుతికి పాత్రుడ యేసయ్యా

పాట రచయిత: ఫిలిప్ గరికి
Lyricist: Philip Gariki

Telugu Lyrics


స్తుతికి పాత్రుడ యేసయ్యా
నా స్వాస్థ్య భాగము నీవయ్యా (2)
పూర్ణ హృదయముతో పాడి కొనియాడెద (2)
నీవే నా రక్షణ – నీవే నా స్వస్థత
నీవే నా విడుదల (2)    ||స్తుతికి||

పాప ఊభిలో నుండి – పైకి లేపితివి
మరణ ఛాయను తొలగించి – కరుణ చూపితివి (2)
నీ వైపే చూస్తూ – నీతోనే నడుస్తూ
నీ వెనకే చేరెద యేసూ (2)       ||నీవే||

జీవాహారము నీవే – జీవ జలము నీవే
నీదు నామమే శక్తి – లేదు ఇలలో సాటి (2)
ప్రతి మోకాలొంగును – ప్రతి నాలుక ఒప్పును
యేసు రాజా నీ యెదుట (2)       ||నీవే||

English Lyrics

Audio

నీ ధనము నీ ఘనము

పాట రచయిత: బొంతా సమూయేలు
Lyricist: Bonthaa Samooyelu

Telugu Lyrics

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా – వెనుదీతువా       ||నీ ధనము||

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా (2)
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా          ||నీ ధనము||

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా (2)
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా        ||నీ ధనము||

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా (2)
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా          ||నీ ధనము||

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు (2)
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా        ||నీ ధనము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME