కల్వరి గిరిపై సిలువ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా (2)

దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన (2)
కేక వేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా (2)       ||కల్వరి||

మూడు దినములు సమాధిలో
ముదము తోడ నిద్రించితివా (2)
నా రక్షణకి సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి (2)       ||కల్వరి||

ఆరోహణమై వాగ్ధానాత్మన్
సంఘము పైకి పంపించితివా (2)
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను (2)       ||కల్వరి||

English Lyrics

Audio

అడుగడుగున రక్త బింధువులే

Telugu Lyrics


అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే (2)
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం          ||అడుగడుగున||

సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి (2)         ||అడుగడుగున||

కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2)         ||అడుగడుగున||

మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా (2)         ||అడుగడుగున||

English Lyrics

Audio

HOME