విజయ గీతముల్ పాడరే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విజయ గీతముల్ పాడరే
క్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)
వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవ
నిజ కుమారుని నామమున్
హృదయములతో – భజన జేయుచు నిత్యమున్           ||విజయ||

మంగళముగ యేసుడే
మనకు రక్షణ – శృంగమై మరి నిలచెను
నింగిన్ విడిచి వచ్చెను
శత్రుని యుద్ధ – రంగమందున గెల్చెను
రంగు మీరగదన – రక్త బలము వలన
పొంగు నణగ జేసెను
సాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ||

పాపముల్ దొలగింపను
మనలను దన స్వ – రూపంబునకు మార్పను
శాపం బంతయు నోర్చెను
దేవుని న్యాయ – కోపమున్ భరియించెను
పాపమెరుగని యేసు – పాపమై మనకొరకు
పాప యాగము దీర్చెను
దేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ||

సిలువ మరణము నొందియు
మనలను దనకై – గెలువన్ లేచిన వానికి
చెలువుగన్ విమలాత్ముని
ప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికి
కొలువు జేతుమెగాని – ఇలను మరువక వాని
సిలువ మోయుచు నీ కృపా
రక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||

English Lyrics

Audio

 

 

భజన చేయుచు భక్తపాలక

పాట రచయిత: దొరసామి ఆరోగ్యము
Lyricist: Dorasaami Aarogyamu

Telugu Lyrics

భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును (2)
వృజినములపై జయము నిచ్చిన (2)
విజయుడా నిను వేడుకొందు         ||భజన||

దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు (2)
భవ్యమైన బోధలెన్నో (2)
బాగుగా ధర నేర్పినావు           ||భజన||

నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు (2)
పరుడ నైన నా కొరకు నీ (2)
ప్రాణము నర్పించినావు           ||భజన||

చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు (2)
పడిన నాడు గోతి నుండి (2)
పైకి లేవనెత్తి నావు          ||భజన||

ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు (2)
ఇంతయని వర్ణింప నిలలో (2)
నెవనికిని సాధ్యంబు కాదు          ||భజన||

English Lyrics

Audio

HOME