దేవునియందు నిరీక్షణ నుంచి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2)      ||దేవుని||

చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
సత్యమగు – జీవమగు – మార్గమేసే (2)      ||దేవుని||

నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
ఆధారము – ఆదరణ – ఆయనలో (2)      ||దేవుని||

తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2)      ||దేవుని||

నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2)      ||దేవుని||

పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
కనికర – సంపన్నుడు – నా దేవుడు (2)      ||దేవుని||

స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2)      ||దేవుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

స్తుతులకు పాత్రుడు యేసయ్యా

Telugu Lyrics

స్తుతులకు పాత్రుడు యేసయ్యా
స్తుతి కీర్తనలు నీకేనయ్యా (2)
మహిమకు పాత్రుడు ఆయనయ్యా
కీర్తియు ఘనతయు రాజునకే

నే పాడెద ప్రభు సన్నిధిలో
నే ఆడెద ప్రభు సముఖములో
చిన్ని బిడ్డను పోలి నే (2)

స్తుతి చెల్లించెద యేసయ్యా
మహిమకు పాత్రుడు మెస్సయ్యా (2)
నిరతము పాడెద హల్లెలూయా
ఆల్ఫా ఓమెగయు నీవేనయ్యా          ||నే పాడెద||

English Lyrics

Audio

HOME