యేసుకు యేసే ఇల సాటి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసుకు యేసే ఇల సాటి
వివరింపగ నేనేపాటి (2)
పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2)
వివరింపగ నేనేపాటి (2)       ||యేసుకు||

రక్షణనిచ్చే రక్షకుడవు
విడుదలనిచ్చే విమోచకుడవు (2)
ఆదరించే ఆధారణకర్తవు (2)
అభిషేకించే అభిషిక్తుడవు (2)
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి     ||పరమ||

శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు
ముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2)
ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2)
రాజ్యాలేలే రాజాధి రాజువు (2)
ఇలలో ఎవ్వరు నీ సాటి
వివరింపగ నేనేపాటి     ||పరమ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME