నూతన హృదయము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics

నూతన హృదయము నూతన స్వభావము
నూతన ప్రారంభం నాకు దయచేయుము
చెదరిన బ్రతుకును పగిలిన గుండెను
నలిగిన మనస్సును నూతన పరచుము
యేసు నీవే నన్ను సృజియించిన వాడవు
నా బలహీనతలన్ని యెరిగియున్నావు
రాతి గుండెను నాలో తీసివేయుము
అతి మెత్తని హృదయము దయచేయుము         ||నూతన హృదయము||

జీవమును వదులుకుని వెలుపలకు నే పారిపోతిని
పాపములో భోగమును ఆశించి నే మోసపోతిని
నా దేహం నా హృదయం వ్యసనముతోనే నిండిపోయెను
హీనముగా దిగజారి ఘోరముగా నే కృంగిపోతిని
నిన్ను విడచి నే క్షణమైనా బ్రతుకలేక
వెనుతిరిగి నీ చెంతకు వచ్చుచున్నాను
శుద్ధజలమును నాపై వెదజల్లుము
హిమము కంటెను తెల్లగా కడిగివేయుము         ||నూతన హృదయము||

నా పాపం అపరాధం నానుండి దూరము చేయుదువు అని
నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని
నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవు అని
నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడియున్నాను
నీ శరణు కోరువారిని త్రోసివేయవు
కృపగల మహాదేవ నన్ను మన్నించుము
సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును
సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును         ||నూతన హృదయము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గూడు లేని గువ్వలా

పాట రచయిత: గుంటూరు రాజా
Lyricist: Guntur Raja

Telugu Lyrics


గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా        ||గూడు||

గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2)        ||నా ప్రాణమా||

చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2)        ||నా ప్రాణమా||

English Lyrics

Audio

నెమ్మది లేదా

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Telugu Lyrics

నెమ్మది లేదా నెమ్మది లేదా – ఒంటరివైనావా
చీకటి బ్రతుకులో వెలుగు లేక – తిరుగుచున్నావా
ఆశలు ఆవిరై పోయినా
నీ కలలన్ని చెదరిన
అలసిపోక సాగిపోవుమా (2)        ||నెమ్మది||

నీ వారు నిన్ను హేళన చేసినా
నీ ప్రేమ బంధు నిన్ను విడచిననూ
గాఢాంధ కారం నిన్ను చుట్టిననూ
అవమానం నింద కలచి వేస్తున్నా
నిను విడువని దేవుడే నీ తోడుగా ఉందును
నీదు వేదనలలోనే నీకు ధైర్యము నిచ్చును
నీ కోసమే తను నిలిచెను
నీ బాధను తొలగించును         ||నెమ్మది||

నీ కన్నీరంతా తుడిచి వేయును
నీ గాయాన్నంతా మాన్పి వేయును
విలువైన పాత్రగ నిన్ను మార్చును
నీ వారికే నిన్ను దీవెనగా చేయును
కాపరి వలె నిన్ను తన కృపలతో నడుపును
నిత్య జీవ మార్గం నీకు ఆయనే చూపును
తన ప్రేమకు నువ్వు సాక్షిగా
జీవించుమా ఇల నిత్యము

నెమ్మది పొందు నెమ్మది పొందు – యేసే నీ తోడు
చీకటి బ్రతుకులో వెలుగు చూపే – యేసే నీ మార్గం

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

 

HOME