ఎల్ షమా

పాట రచయిత: జెస్సి పాల్
Lyricist: Jessy Paul

దేవా చెవియొగ్గుము.. దృష్టించుము.. నిన్నే వెదకుచున్నాను
దేవా సెలవియ్యుము.. బదులీయము.. నిన్నే వేడుచున్నాను

ప్రతి ఉదయం – నిను నమ్మి
ప్రతి రాత్రి – నిను వేడి
ప్రతి ఘడియ – నిను కోరి.. నహాళ్

ఆశతో వేచి ఉన్నా – నీవే నా నమ్మకం
ఓర్పుతో కాచి ఉన్నా – నీవేగా నా ధైర్యం (2)

ఎల్ షమా (3)
నా ప్రార్ధన వినువాడా (2)

ఎండిన భూమి వలె క్షీణించుచున్నాను (వేచి వేచి యున్నాను)
నీ తట్టు నా కరముల్ నే చాపుచున్నాను (2)
ఆత్మవర్షం నాపైన కురిపించుము ప్రభు
పోగొట్టుకున్నవి మరలా దయ చేయుము
ఆత్మ వర్షం కురిపించి నను బ్రతికించుము
నీ చిత్తము నెరవేర్చి సమకూర్చుము ప్రభు           ||ఎల్ షమా||

విడిచిపెట్టకు ప్రభు ప్రయత్నిస్తున్నాను
అడుగడుగు నా తోడై ఒడ్డుకు నను చేర్చవా (2)
యెహోవా నా దేవా నీవే నాకున్నది
బాధలో ఔషధం నీ ప్రేమే కదా (2)          ||ఎల్ షమా||

నీ శక్తియే విడిపించును
నీ హస్తమే లేవనెత్తును
నీ మాటయే నా బలము
నీ మార్గము పరిశుద్ధము (2)          ||ఎల్ షమా||

Download Lyrics as: PPT

ఆకాశమా ఆలకించుమా

పాట రచయిత: మధు
Lyricist: Madhu

Telugu Lyrics

ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియొగ్గుమా (2)
అని దేవుడు మాటలడుచున్నాడు
తన వేదన నీతో చెబుతున్నాడు (2)        ||ఆకాశమా||

నేను పెంచిన నా పిల్లలే
నా మీదనే తిరగబడిరనీ (2)
అరచేతిలో చెక్కుకున్నవారే
నా అరచేతిపై మేకులు కొడుతూ (2)
నను దూరంగా ఉంచారని
నా పిల్లలు బహు చెడిపోతున్నారని (2)        ||దేవుడు||

విస్తారమైన బలులు నాకేల
క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే (2)
కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం
మేకల రక్తం నాకిష్టము లేదు (2)
కీడు చేయ మానాలని
బహు మేలు చేయ నేర్వాలని (2)        ||దేవుడు||

పాపిష్టి జనమా, దుష్టసంతానమా
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ

అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు
మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును
ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు
మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును
నన్ను విసర్జించువారు లయమగుదురని
నీరులేని తోటలా నశియింతురని (2)        ||దేవుడు||

ఆకాశమా భువికి చెప్పుమా
భూమీ లోకాన చాటుమా (2)

English Lyrics

Audio

ఎవరో తెలుసా యేసయ్యా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా (2)

దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై (2)        ||ఎవరో||

ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై (2)        ||ఎవరో||

పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై (2)
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో (2)        ||ఎవరో||

యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా (2)
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా (2)         ||ఎవరో||

యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని (2)       ||ఎవరో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME