మేలు చేయక

పాట రచయిత: జోబ్ దాస్
Lyricist: Job Das

Telugu Lyrics

మేలు చేయక నీవు ఉండలేవయ్యా
ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2)       ||మేలు చేయక||

నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2)
నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2)
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది            ||యేసయ్యా||

ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2)
నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2)
నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి             ||యేసయ్యా||

పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2)
నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2)
అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు            ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దుర్దినములు రాకముందే

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics


దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       ||దుర్దినములు||

సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       ||దుర్దినములు||

రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       ||దుర్దినములు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME