మంచి దేవుడు నా యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మంచి దేవుడు నా యేసయ్యా
చింతలన్ని బాపునయ్యా
హృదయ వాంఛతో చేరిన వారికి
శాంతి జీవము ఇచ్చునయ్యా (2)
మహిమా ఘనత ప్రభావము నీకే (2)

కృపల వెనక కృపను చూపి
విడువక నీ కృపలను చూపిన (2)
కృపగల నా యేసు రాజా
నీ కృప నాకు చాలునయ్యా (2)         ||మహిమా||

మహిమ వెంట మహిమ నొసగి
నీ రూపమున నన్ను మార్చి (2)
మహిమతో నీవుండు చోటుకి
మమ్ము ప్రేమతో పిలచితివి (2)         ||మహిమా||

జయము వెంట జయమునిచ్చి
జయ జీవితము మాకు ఇచ్చి (2)
జయశీలుడు నా యేసు ప్రభువని
జయము జయమని పాడెదను (2)         ||మహిమా||

English Lyrics

Audio

ఎంత మంచి దేవుడవేసయ్యా

పాట రచయిత: పెర్సి థెరీసా
Lyricist: Percy Theresa

Telugu Lyrics

ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా (2)        ||ఎంత||

ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా (2)       ||ఎంత||

నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా (2)      ||ఎంత||

నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా (2)      ||ఎంత||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME