యేసూ ఎంతో వరాల మనస్సూ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసూ.. ఎంతో వరాల మనస్సూ నీది
చిత్ర చిత్రాలుగా విన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సా – నీ మనసు హైలెస్సా – (2)      ||యేసూ||

గాలి వానొచ్చి నడి యేటిలోన
నావ అల్లాడగా – నీవే కాపాడినవే హో..
కంట చూడంగ గాలాగిపోయే
అలలే చల్లారెనే – మహిమ చూపించావే (2)
నీవే రేవంట ఏ నావకైనా
కడలే నీవంట ఏ వాగుకైనా (2)
ఉప్పొంగె నీ ప్రేమలో       ||ప్రభువా||

దిక్కు లేనట్టి దీనాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా ఆ..
జంతు బలులిచ్చే మూడాత్ములంటే
నీలో కలిగే దయ – నాడే తెలిసిందయ్యా (2)
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగులలో చేపంటి వాడ (2)
నా దారి గోదారిలో         ||ప్రభువా||

English Lyrics

Audio

చిత్ర చిత్రాల వాడే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2)           ||చిత్ర||

కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)        ||చిత్ర||

English Lyrics

Audio

 

 

HOME