దైవ కుటుంబం

పాట రచయిత: కోటి బాబు
Lyricist: Koti Babu

Telugu Lyrics


దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం (2)
శాంతి సంతోషాలకు అది నిలయం
ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం (2)
విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధత లోగిళ్ళు (2)
ఆతిథ్యమిచ్చే వంటిల్లు వర్ధిల్లు నూరేళ్ళు (2)
దైవ కుటుంబపు సంతోషం
కని విని ఎరుగని ఆనందం (4)        ||దైవ కుటుంబం||

రక్షణ పొందిన కుటుంబం మోక్ష పురికి సోపానం
క్రమశిక్షణ కలిగిన కుటుంబం వీక్షించు దైవ సాన్నిధ్యం (2)
అపార్ధాలు అంతరాలు లేనట్టి అన్యోన్యత
షడ్రుచుల ఘుమఘుమలు గుభాలించు మా ఇంట (2)
అష్టైశ్వర్యాలకు తూలతూగే కుటుంబం (2)
తరతరాలు వర్ధిల్లే కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

మమతలు కలిగిన కుటుంబం సంతృప్తినిచ్చే కుటుంబం
ధాన్య ధన వస్తు వాహనాలు కావు మా యింటి కంభాలు (2)
భయభక్తులు దేవోక్తులు మా అన్న పానాలు
మా యొక్క నట్టింట్లో వసియించును దేవుడు(2)
పెనవేసుకున్న బంధాలే ఈ కుటుంబం (2)         ||దైవ కుటుంబపు||

English Lyrics


Daiva Kutumbam Dharanilo Devuni Prathibimbam (2)
Shaanthi Santhoshaalaku Adi Nilayam
Aapyaayatha Anuraagaalaku Ika Aarambham (2)
Vishwaasapu Vaakillu Parishuddhatha Logillu (2)
Aathithyamichche Vantillu Vardhillu Noorellu (2)
Daiva Kutumbapu Santhosham
Kani Vini Erugani Aanandam (4)         ||Daiva Kutumbam||

Rakshana Pondina Kutumbam Moksha Puriki Sopaanam
Krama Shikshana Kaligina Kutumbam Veekshinchu Daiva Saanidhyam (2)
Apaardhaalu Aantharaalu Lenatti Anyonyatha
Shadruchula Ghuma Ghumalu Gubhaalinchi Maa Inta (2)
Ashtaishwaryaalaku Thulathooge Kutumbam (2)
Thara Tharaalu Vardhille Kutumbam (2)        ||Daiva Kutumbapu||

Mamathalu Kaligina Kutumbam Santhrupthinichche Kutumbam
Dhaanya Dhana vasthu Vaahanaalu Kaavu Maa Yinti Kambhaalu (2)
Bhaya Bhakthulu Devokthulu Maa Anna Paanaalu
Maa Yokka Nattintlo Vasiyinchunu Devudu (2)
Penavesukunna Bandhaale Ee Kutumbam (2)        ||Daiva Kutumbapu||

Audio

ప్రాణేశ్వర

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే- ఆశతీర         ||ప్రాణేశ్వర||

నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2)
నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2)   ||ప్రాణేశ్వర||

మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2)
నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి (2)     ||ప్రాణేశ్వర||

పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2)
నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2)     ||ప్రాణేశ్వర||

నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను (2)
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2)     ||ప్రాణేశ్వర||

కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2)
కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2)   ||ప్రాణేశ్వర||

English Lyrics


Praaneshwara – Prabhu Daiva Kumaara
Pranuthinthunu Ninne – Aasha Theera        ||Praaneshwara||

Naa Aathmatho Paatalu Paada
Nee Krupale Naaku Hethuvulaaye (2)
Nithya Nibandhana Neetho Chesi
Nee Paada Sannidhi Cheri Yunnaane (2)      ||Praaneshwara||

Moolaraayi Neevaiyundagaa
Aposthalula Punaadi Meeda (2)
Nithya Nivaasamugaa Kattabadutakai
Aathmaabhishekamu Anugrahinchithivi (2)      ||Praaneshwara||

Pidugulu Visire Merupula Vanti
Shathruvulu Naaku Edurai Nilchina (2)
Naaku Virodhamugaa Roopinchina
Ae Aaayudhamu Vardhillaledu (2)      ||Praaneshwara||

Naa Ootalanniyu Nee Yandenani
Vaadyamu Vaayinchi Paadedanu (2)
Jeevitha Kaalamanthaa Ninne Sthuthinchi
Saageda Noothana Yerushalemu (2)      ||Praaneshwara||

Kamaneeyamaina Nee Darshanamu
Kalanainanu Melakuvanaina (2)
Kanabadinaa Na Aashalu Theerave
Kanipettuchuntini Kada Boora Dhwaniki (2)      ||Praaneshwara||

Audio

HOME