ఆ దరి చేరే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఆ దరి చేరే దారే కనరాదు
సందె వెలుగు కనుమరుగై పోయే
నా జీవితాన చీకటులై మ్రోగే (2)
ఆ దరి చేరే
హైలెస్సో హైలో హైలెస్సా (2)

విద్య లేని పామరులను పిలిచాడు
దివ్యమైన బోధలెన్నో చేసాడు (2)
మానవులను పట్టే జాలరులుగా చేసి
ఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2)      ||ఆ దరి||

సుడి గాలులేమో వీచెను
అలలేమో పైపైకి లేచెను (2)
ఆశలన్ని అడుగంటిపోయెను
నా జీవితమే బేజారైపోయెను (2)      ||ఆ దరి||

వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడు
ఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)
దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగా
ఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2)      ||ఆ దరి||

 

English Lyrics

Audio

హల్లెలూయా స్తోత్రం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (4)
యేసయ్యా నీవే నా రక్షకుడవు
యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
దరి చేర్చి ఆదరించుమా
ఓ యేసయ్యా… దరి చేర్చి ఆదరించుమా
వి ప్రెయిస్ యు అండ్ వర్షిప్ యు
ఆల్మైటీ గాడ్.. ప్రైస్ యు అండ్ వర్షిప్ యు
హాల్లేలూయా ఆమెన్
ఓ యేసయ్యా.. ఆమెన్ హాల్లేలూయా

పరిశుద్ధ తండ్రి ప్రేమా స్వరూపివి
సర్వాధికారివి.. ఓ యేసయ్యా (2)
కరుణించి కాపాడుమా
ఓ యేసయ్యా.. కరుణించి కాపాడుమా (2)          ||హల్లెలూయా||

స్తుతులకు పాత్రుడా – స్తోత్రించి కీర్తింతున్
కొనియాడి పొగడెదన్.. ఓ యేసయ్యా (2)
కృప చూపి నడిపించుమా
ఓ యేసయ్యా.. కృప చూపి నడిపించుమా (2)          ||హల్లెలూయా||

English Lyrics

Audio

HOME