యెహోవా నను కరుణించుమా

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


యెహోవా నను కరుణించుమా
నా దేవా నను దర్శించుమా (2)
ఉదయమునే నీ సన్నిధిలో మొరపెడుతున్నాను
వేకువనే నీ కృప కొరకు కనిపెడుతున్నాను
దినమంతయు నేను ప్రార్ధించుచు ఉన్నాను       ||యెహోవా||

విచారము చేత నా కన్నులు గుంటలై
వేదన చేత నా మనస్సు మూగదై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2)      ||దినమంతయు||

అవమానము చేత నా గుండెలో గాయమై
(నడి) వంచన చేత నా ఊపిరి భారమై (2)
నా హృదయమెంతో అలసి సొలసి ఉన్నది
నా ప్రాణము నీకై ఎదురు చూస్తూ ఉన్నది (2)      ||దినమంతయు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

బలమైనవాడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


బలమైనవాడా బలపర్చువాడా
మరలా నన్ను దర్శించుమా
స్తోత్రం స్తోత్రం (2)
స్తోత్రం నీకేనయ్యా
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నీకేనయ్యా         ||బలమైన||

ఎండిపోతిని దిగజారిపోతిని
నీ కొరకే నేను బ్రతకాలని
మరలా నన్ను దర్శించుము (2)
మొదటి ప్రేమ మొదటి పవిత్రత
మరలా నాలోన దయచేయుమా (2)         ||బలమైన||

అల్పుడనైతిని అభిషేకం కోల్పోతిని
నీలోన నేను ఉండాలని
మరలా నన్ను వెలిగించుము (2)
మొదటి తీవ్రత మొదటి శక్తి
సర్వదా నాపై కురిపించుమా (2)         ||బలమైన||

English Lyrics

Audio

HOME