కృపగల దేవా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

కృపగల దేవా దయగల రాజా

కృపగల దేవా దయగల రాజా
చేరితి నిన్నే బహు ఘనతేగా
నీ చరణములే నే కోరితిని
నీ వరములనే నే వేడితిని (2)
సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువా
నా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివి
అర్పించెదను నా సర్వమును నీకే దేవా
ఆరాధించి ఆనందించెద నీలో దేవా (2)       ||కృపగల||

త్రోవను చూపే తారవు నీవే
గమ్యము చేర్చే సారథి నీవే (2)
జీవన యాత్రా శుభప్రదమాయే
నా ప్రతి ప్రార్థన పరిమళమాయె
నీ ఉదయకాంతిలో నను నడుపుము
నా హృదిని నీ శాంతితో నింపుము (2)       ||కృపగల||

కృప చూపి నన్ను అభిషేకించి
వాగ్ధానములు నెరవేర్చినావే (2)
బహు వింతగా నను ప్రేమించినావే
బలమైన జనముగా నను మార్చినావే
నీ కీర్తి జగమంత వివరింతును
నీ దివ్య మహిమలను ప్రకటింతును (2)       ||కృపగల||

నా యేసురాజా వరుడైన దేవా
మేఘాల మీద దిగి వచ్చు వేళ (2)
ఆకాశ వీధిలో కమనీయ కాంతిలో
ప్రియమైన సంఘమై నిను చేరెదను
నిలిచెదను నీతోనే సీయోనులో
జీవింతు నీలోనే యుగయుగములు (2)       ||కృపగల||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చిత్ర చిత్రాల వాడే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2)           ||చిత్ర||

కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)        ||చిత్ర||

English Lyrics

Audio

 

 

HOME