ప్రియ యేసు దేహములో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట
ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా

కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా
సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే      ||ప్రియ యేసు||

నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై
నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా      ||ప్రియ యేసు||

ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ
బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా      ||ప్రియ యేసు||

ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను
సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వివాహమన్నది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

English Lyrics

Audio

HOME