ఎంత మంచి దేవుడవయ్యా

పాట రచయిత: దియ్యా ప్రసాదరావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)

సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)
జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)           ||ఎంత మంచి||

ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)          ||ఎంత మంచి||

సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)
చివరికది నీలోనే కనుగొన్నాను (2)         ||ఎంత మంచి||

English Lyrics

Audio

HOME